Saturday, 8 February 2020

రామ్‌చరణ్ సినిమాపై ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ కామెంట్

చిట్టిబాబుకి తెలుగు ప్రేక్షకులే కాదు ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తిగారు కూడా ఫిదా అయిపోయారు. అదేనండీ.. మెగా పవర్‌స్టార్ నటించిన ‘రంగస్థలం’ సినిమా గురించి. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సమంత కథానాయికగా, యాంకర్ అనసూయ రంగమ్మత్త అనే కీలక పాత్రలో నటించారు. 1990ల కాలం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా సుధామూర్తిని ఎంతగానో ఆకట్టుకుందట. ఓ ఛానెల్‌కు ఇటీవల సుధా మూర్తి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు ఎక్కువగా నందమూరి రామారావు గారి సినిమాలు చూసేదాన్ని. ఆయన నటించిన ‘మాయా బజార్’, ‘దానవీర శూర కర్ణ’ సినిమాలను చూసా. మనకి కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు. కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ నా అభిప్రాయంలో కృష్ణుడు అంటే ఎన్టీఆరే. ఎప్పుడైనా కృష్ణుడిని స్మరించుకుంటే నాకు ఎన్టీఆరే కనిపిస్తారు. అంతేకాదు.. అన్నమయ్య, ఓం నమో వేంకటేశాయ సినిమాలు కూడా చూసాను. ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చూసాను. చాలా నచ్చింది. చరణ్ నటన అద్భుతంగా ఉంది. మనం సినిమా కూడా చూసా. కన్నడ సినిమాలు కూడా ఎక్కువగా చూస్తాను’ అని తెలిపారు. READ ALSO: రంగస్థలం సినిమాలో ప్రముఖ తమిళ నటుడు ఆది రామ్ చరణ్ అన్న పాత్రలో నటించారు. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ విలన్‌గా అదరగొట్టేసారు. చెర్రీ కెరీర్‌లో ఈ సినిమా ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HbBjMU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...