దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు .. తన తల్లిలా చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు. 2018లో వచ్చిన ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. ఆ తర్వాత ఓ మంచి బయోపిక్‌లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఐఏఎఫ్‌కి చెందిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో ప్రస్తుతం జాన్వి నటిస్తున్నారు. అయితే జాన్వికి సంబంధించి రోజూ ఆమె జిమ్‌కి వెళ్లే ఫొటోలు వైరల్ అవుతుంటాయి. జాన్వి వెళ్లే జిమ్ వద్ద ముంబయికి చెందిన ఎందరో ఫొటోగ్రాఫర్స్ ఎదురుచూస్తుంటారు. జాన్వి కారులో నుంచి బయటకు దిగగానే చకచకా ఫొటోలు తీసేస్తుంటారు. READ ALSO: దీని గురించి జాన్వి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు ఫ్యాన్స్ నా దగ్గరకు వచ్చి నేను నటించిన తొలి సినిమా ధడక్ చాలా బాగుంది అని చెప్పేవారు. ఇప్పుడేమో నేను జిమ్‌కి వేసుకునే దుస్తులు చాలా బాగుంటున్నాయ్ అంటున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని నేను ఫ్యాన్స్‌ని తప్పుబట్టలేను. ఎందుకంటే ఫ్యాన్స్ వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. మున్ముందు నేను వేసుకునే పొట్టి దుస్తుల గురించి కాకుండా నేను చేసే సినిమాల గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను’ అని తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SyjZar
v
No comments:
Post a Comment