బాలీవుడ్ నటులు , రణ్‌బీర్ కపూర్ ఎప్పటినుంచో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇద్దరూ క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ పెళ్లి పనులు కూడా జరిగిపోతున్నాయని టాక్. డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. దీని గురించి మీడియా వర్గాలు ఆలియాను ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం నా పెళ్లి మీద ఏ రూమర్ ఉందో తెలీదు. ప్రతి మూడు వారాలకు ఓసారి నా పెళ్లి డేటు మారుతోంది. కానీ ఇది నాకు చాలా నచ్చింది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. నాకు ఈ రూమర్స్ నుంచి కేవలం వినోదం మాత్రమే లభిస్తోంది’’ అన్నారు. గతేడాది రణ్‌బీర్.. ఆలియాను తనకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడగేందుకు ఆలియా ఇంటికి వెళ్లారట. ఆ సమయంలో రణ్‌బీర్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారట. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్‌బీర్, ఆలియా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి తరచూ విహారయాత్రలకు కలిసి వెళ్లడం, పార్టీలకు వెళ్లడం వంటివి చేస్తూ కనిపించారు. మరోపక్క రణ్‌బీర్, ఆలియాల ప్రేమ రోజురోజుకీ బలపడుతోంది. కానీ ఏ విషయం అన్నది ఇద్దరూ తేల్చడంలేదు. రణ్‌బీర్ పక్కనుంటే తనకు మేఘాల్లో తేలిపోతున్నట్లుగా ఉంటుందని ఒకానొక సందర్భంలో ఆలియా అన్నారు. మరోసారేమో.. రణ్‌బీర్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని అన్నారు. మరోపక్క వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయట. READ ALSO: మొత్తానికి బ్రహ్మాస్త్ర సినిమా విడుదలయ్యే వరకు వీరిద్దరూ ఏ విషయం అన్నది తేల్చేలా లేరు. ఎవరికి తెలుసు.. బాలీవుడ్ జంట దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లా ఒకేసారి శుభలేఖలను సోషల్ మీడియా పోస్ట్ చేసి అసలు విషయం చెప్పినట్లుగానే ఆలియా, రణ్‌బీర్ కూడా తమ పెళ్లి గురించి అలాగే ప్రకటిస్తారేమో..! READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bNhABv
v
No comments:
Post a Comment