Monday, 24 February 2020

శ్యామ్ సింగ రాయ్.. నాని 27వ సినిమాకు వైవిధ్యమైన టైటిల్

నేచురల్ స్టార్ నాని తన తరవాత సినిమాను ప్రకటించారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నాని మరో విభిన్నమైన చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. ఆ సినిమా టైటిల్‌ను తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి 24న) ప్రకటించారు. ‘శ్యామ్ సింగ రాయ్’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో నాని వస్తున్నారు. ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ సనిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నాని 27వ సినిమా. ఈ చిత్ర టైటిల్‌ను ఒక స్పెషల్ కాన్సెప్ట్ వీడియో ద్వారా ప్రకటించారు. పాత కాలంలో ఉండే టైప్ మెషీన్‌ను ఈ వీడియోలో వాడుకున్నారు. టైప్ చేసేటప్పుడు వచ్చే ఆ సౌండ్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా తీసుకున్నారు. ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్ పడగానే పేపర్ చిరిగి ఆ ప్రాంతంలో నాని కళ్లు కనిపించాయి. మొత్తం మీద ఈ కాన్సెప్ట్ వీడియో, టైటిల్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం నాని ‘వి’ సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సుధీర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నానిది నెగిటివ్ రోల్. ఇప్పటికే విడుదలైన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంంది. ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. మరోవైపు, శివనిర్వాణ దర్శకత్వంలో మరో చిత్రాన్ని కూడా నాని లైన్‌లో పెట్టారు. దీనికి ‘టక్ జగదీశ్’ అనే టైటిల్ ఖరారు చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bWuywK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...