రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే పాపం తిట్టుకునేవారే ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక పుల్ల పెడుతూ వివాదాలు రేపుతుంటాడు అనేది చాలా మంది అభిప్రాయం. కానీ వర్మలో ఓ మంచి మనిషి కూడా ఉన్నాడని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ ‘భూత్: ది హాంటెడ్ షిప్’ అనే హార్రర్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. అయితే ఇదే సినిమా టైటిల్‌తో 2003లో వర్మ ఓ సినిమా తెరకెక్కించారు. ఇందులో ఊర్మిళ మటోండ్కర్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తన సినిమాకు ఏ టైటిల్ పెట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే కరణ్‌కు ‘భూత్: ది హాంటెడ్ షిప్’ అనే టైటిల్ గుర్తుకొచ్చింది. పోనీ వాడేసుకుందామా అంటే వర్మ ఏమంటారోనని భయపడ్డారట. ఓసారి అడిగి చూద్దామని భయపడుతూనే వర్మకు ఫోన్ చేశారట కరణ్ జోహార్. అయితే వర్మ అంత బాగా మాట్లాడతారని తాను కల్లో కూడా ఊహించలేదని కరణ్ తెలిపారు. READ ALSO: ‘‘భూత్ అనే టైటిల్ ఈ సినిమాకు కరెక్ట్‌గా సరిపోతుంది. కానీ ఓసారి వర్మను అడిగితే పోలా అని ఆయనకు ఫోన్ చేద్దామని అనుకున్నాను. ఏమనుకుంటారో అని భయపడుతూనే వర్మకు ఫోన్ చేశాను. కానీ ఆయన మంచితనానికి ఫిదా అయిపోయాను. నేను చెప్పినదంతా విని ఆయన ఒక్కటే మాట అన్నారు. నీకు నా సినిమాలకు సంబంధించిన ఏ టైటిల్ కావాలన్నా తీసుకో. ఏ పేపర్‌లో సంతకం పెట్టమన్నా పెడతాను అన్నారు. అలా రెండు సెకన్లలోనే ఆయన తన సినిమా టైటిల్‌ను నాకు ఇచ్చేసారు. ఆయన అంత బాగా మాట్లాడతారని అనుకోలేదు. నేను చిత్ర పరిశ్రమలో 25 ఏళ్లుగా ఉన్నాను. అంతటి మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు’ అని తెలిపారు కరణ్. ‘భూత్: ది హాంటెడ్ షిప్’ సినిమాలో భూమి పెడ్నేకర్ కథానాయికగా నటించారు. ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2v2op1f
v
No comments:
Post a Comment