Tuesday, 4 February 2020

మహేష్ ఖాతాలో కొత్త బ్రాండ్.. ‘హలో’ అంటున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలతో పాటు ఇటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నారు. చాలా బ్రాండ్లకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సాయి సూర్య డెవలపర్స్, సంతూర్, క్లోజ్‌ అప్, అభి బస్, థమ్స్ అప్ వంటి బ్రాండ్లను ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో మరో బ్రాండ్ చేరింది. ఈ మధ్య కాలంలో ప్రజలకు బాగా చేరువైన సోషల్ మీడియా యాప్ ‘హలో’కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు తన ప్రచార వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘హలో’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో తనను ఫాలో కావాలని కోరారు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు మహేష్. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.125 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు బోలెడన్ని లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ కోసం అమెరికా వెళ్లిన మహేష్ అక్కడే వారితో ఈ సక్సెస్‌ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. Also Read: కాగా, మహేష్ తన తరవాత సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. గత ఏడాది మహేష్‌కు ‘మహర్షి’ వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి.. ఈసారి మంచి కమర్షియల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారు. మహేష్ బాబు కూడా నిర్మాణంలో భాగం కానున్నట్టు తెలిసింది. ఈ ఏడాది మే నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘భరత్ అనే నేను’లో నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నట్టు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bbsFft
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...