మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో హీరో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. ఎక్కడకు వెళ్లినా సౌమ్యంగా వ్యవహరించే మెగాస్టార్ .. స్టేజ్‌పైనే రాజశేఖర్ వ్యవహారశైలిని ఖండించారు. ఆయనపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హీరో రాజశేఖర్ తీరుపై విమర్శలు తలెత్తుతున్నాయి. ‘మా’ వ్యవస్థాపకు అధ్యక్షడు చిరంజీవి మాట్లాడుతుంటే.. పదే పదే అడ్డుపడటం, మైక్ లాక్కోవడమే కాకుండా ఇండస్ట్రీ పెద్దలతో గౌరవం లేకుండా అమర్యాదగా మాట్లాడిన రాజశేఖర్‌పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. Read Also ఈ కార్యక్రమాన్ని రసాభాసగా మార్చాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చిన రాజశేఖర్‌పై ‘మా’ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చిరంజీవి. మా ఫౌండర్‌గా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి ఈ ఇష్యూపై చాలా సీరియస్‌గా ఉండటంతో రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే మా అధ్యక్షుడు నరేష్ స్పాట్ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. మా గురించి మీడియా ముందు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్పాట్ కమిటీకి తెలియజేయవచ్చునన్నారు నరేష్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Fpr5bf
v
No comments:
Post a Comment