టాలీవుడ్‌లో అగ్ర కథానాయిక కెరీర్ సాఫీగా సాగిపోతోంది. హిట్స్, ఫ్లా్ప్స్‌తో సంబంధం లేకుండా అగ్ర కథానాయకులు అందరితో కలిసి నటించే అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పూజ. నెటిజన్స్ సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నలకు పూజ సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే ఓ నెటిజన్ నుంచి పూజకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ ప్రభాస్ మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? అని అడిగారు. దీనికి ఏమని సమాధానం చెప్పాలో తెలీక పూజ వెర్రి చూపులు చూస్తూ కూర్చుంది. ‘నో.. అయినా ఇవేం ప్రశ్నలు. ఒకవేళ ప్రపోజ్ చేస్తే అనే ప్రశ్నకు లాంగ్ స్టోరీ ఉంటుంది. నో నేనైతే దీనికి సమాధానం చెప్పలేను’ అంటూ సిగ్గుపడ్డారు. పూజకు నెటిజన్స్ నుంచి ఎదురైన మరికొన్ని ప్రశ్నలేంటో చూద్దాం. బాలీవుడ్‌లో మీకు ఫస్ట్ హిట్ ‘హౌస్‌ఫుల్ 4’తో వచ్చింది. అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అక్షయ్‌తో కలిసి నటించడం చాలా ఫన్నీగా ఉండేది. అసలు ఎప్పుడు షూటింగ్ మొదలైందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలీలేదు. అక్షయ్ సర్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. సెట్స్‌లో ఖాళీగా కూర్చోరు. ఏదో ఒకటి చేస్తుంటారు. మహేష్ బాబుతో కలిసి మళ్లీ ఎప్పుడు నటించబోతున్నారు. ‘మహర్షి’లో మీ కాంబినేషన్ బాగుంది. మహేష్ బాబు ఓ సూపర్‌స్టార్. ఆయనతో షూటింగ్ ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. నేను ఆయన నుంచి నేర్చుకున్నది వాయిస్ మాడ్యులేషన్. ఎక్కడ తగ్గి మాట్లాడాలో ఎక్కడ వాయిస్ పెంచాలో ఆయనకి బాగా తెలుసు. మున్ముందు ఇద్దరం కలిసి మళ్లీ పనిచేస్తామని ఆశిస్తున్నా. READ ALSO: శ్రద్ధా కపూర్‌పై మీ అభిప్రాయం ఏంటి?బ్యూటిఫుల్. చాలా చాలా ప్రెట్టీగా ఉంటారు. ఇప్పటివరకు మీరు నటించిన పాత్రల్లో ఏది కష్టంగా అనిపించింది? ఇప్పుడు నేను తెలుగులో అఖిల్‌తో ఓ సినిమా చేస్తున్నా. అందులో నాది స్టాండప్ కమెడియన్ పాత్ర. ఆ పాత్ర చాలా టఫ్‌గా అనిపించింది. దీని నుంచి చాలా నేర్చుకుంటున్నా. సల్మాన్ ఖాన్‌తో కలిసి ఎప్పుడు పనిచేస్తారు? నేను కూడా చాలా ఆత్రతుగా ఎదురుచూస్తున్నాను. READ ALSO: రామ్‌చరణ్‌తో కలిసి ‘జిగేలు రాణి’లో నటించారు. మరి సినిమా ఎప్పుడు చేస్తారు? త్వరలో. చరణ్ రాజమౌళి సర్ సినిమాలో చేస్తున్నారు. అది అయిపోయాకే ఆయన తర్వాతి సినిమా గురించి మాట్లాడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2svEXxP
v
No comments:
Post a Comment