Thursday, 2 January 2020

మోహన్‌ బాబుకు ముద్దు పెట్టిన చిరంజీవి

గురువారం పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్‌ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. మాలో విబేధాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజశేఖర్‌పై సినీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. , , కృష్ణం రాజులు రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలను డిసిప్లయినరీ కమిటీకి సూచించారు. అయితే వాడివేడి చర్చ తరువాత మైక్‌ అందుకున్న సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు వేదిక మీద నవ్వులు పూయించారు. వేదిక మీద ఉన్న పెద్దలకు స్వాగతం పలుకుతూ కృష్ణంరాజును తాతగారు అంటూ సంబోధించారు. దీంతో వెనకే ఉన్న చిరు, మోహన్‌ బాబుపై సెటైర్‌ వేయటంతో అంతా నవ్వుకున్నారు. Also Read: తరువాత చిరు గురించి మాట్లాడిన మోహన్‌ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు కూడా వేదికల మీద కలిసినప్పుడు ఒకరి మీద ఒకరు ఛలోక్తులు విసురుకునేవారన్న మోహన్‌ బాబు, చిరుతో తన బంధం కూడా అలాంటిదే అన్నారు. ఒకరి గురించి ఒకరం సరదాగా మాట్లాడుకుంటామే గానీ మా ఇద్దరి కుటుంబాలు ఎంతో ఆప్యాయంగా ఉంటాయని చెప్పారు. అయితే మోహన్ బాబు ఈ మాటలు చెపుతుండగానే చిరు ఆయన దగ్గర వచ్చి కౌగిలించుకున్నారు. అంతేకాదు వేదిక మీద మోహన్‌ బాబు బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడ తమ మధ్య ఏమి లేదని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. చిరంజీవి సతీమణి సురేఖ తనకు చెల్లెలు లాంటిదన్న మోహన్‌ బాబు.. చిరు తన భార్యకు భయపడతాడంటూ సరదాగా కామెంట్ చేశారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QGCB6X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...