సంక్రాంతి బరిలోకి లేటుగా వచ్చినా ‘!’ అంటూ లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చారు నందమూరి హీరో . రచయితగా ముప్పలనేని శివ, ఈవీవీల దగ్గర పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసి ‘దొంగల బండి’ చిత్రంతో దర్శకుడిగా మారి ‘శతమనంభవతి’ లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని రూపొందించిన సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కల్యాణ్ రామ్‌కి జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం మంచి అంచనాలతో నేడు థియేటర్స్‌లో విడులైంది. ఒకవైపు సంక్రాంతి కానుకగా విడుదలైన దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు హిట్ టాక్ సాధించడంతో నందమూరి హీరో సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టీజర్, ట్రైలర్‌లతో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ అనిపించుకున్న ‘ఎంత మంచివాడవురా!’ యూఎస్‌ఏలో ప్రీమియర్స్ షోలు పడ్డాయి. ట్విట్టర్ వేదికగా ‘ఎంత మంచి వాడవురా!’ ఎలా ఉందో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ప్రేక్షకులు. అనుకున్నట్టుగానే కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా!’ ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించేలా చాలా డీసెంట్‌గా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ పూర్తైందని చాలా డీసెంట్‌గా ఉందంటున్నారు. ఇక యుఎస్‌ఏ రిపోర్ట్ ప్రకారం కళ్యాణ్ రామ్ కూడా సంక్రాంతి బరిలో విజయాన్ని అందుకున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ అయితే అన్నిచోట్ల నుండి ‘ఎంత మంచి వాడవురా!’ బెనిఫిట్ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అంటూ వరుస ట్వీట్స్ చేస్తూ కళ్యాణ్ రామ్‌కి మంచి బూస్టింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీకి అన్నివైపుల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా షో పడకపోవడంతో టాక్ రావాల్సి ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aaNWoO
v
No comments:
Post a Comment