Tuesday, 14 January 2020

పవన్‌ సినిమాపై క్లారిటీ ఇచ్చిన తమన్‌

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యాడు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత పవన్‌ సినిమాలకు బ్రేక్‌ ఇవ్వటంలో అభిమానులు ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ మాత్రం సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ విషయంలో చాలా కాలంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నాడు. కొద్ది రోజులుగా పవన్‌ రీ ఎంట్రీ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ సూపర్‌ హిట్ పింక్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్ర దర్శక నిర్మాతలుగానీ, పవన్‌ గానీ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానుల్లో డైలామా అలాగే కొనసాగుతోంది. Also Read: తాజాగా పవన్‌ రీ ఎంట్రీ సినిమా మీద క్లారిటీ ఇచ్చాడు సంగీత దర్శకుడు తమన్‌. అల వైకుంఠపురములో సినిమా సూపర్‌ హిట్ అయిన సందర్భంగా తమన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫ్లవర్‌ బొకేను పంపించాడు పవన్‌. పవర్‌ స్టార్‌ నుంచి శుభాకాంక్షలు అందుకున్న తమన్‌ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన ట్విటర్‌ పేజ్‌లో పవన్‌ పంపిన ఫ్లవర్‌ బొకే ఫోటోను ట్వీట్ చేసిన తమన్‌, `నేను ఆరాధించే వ్యక్తి నుంచి ఇలాంటి గిఫ్ట్ రావటం ఆనందంగా ఉంది. ఇది మన నాయకుడు ఫ్యూచర్‌ పవర్‌ పవన్‌ కళ్యాణ్‌ గారి నుంచి వచ్చింది. కృతజ్ఞతలు సార్‌. ప్రస్తుతం ఆయన సినిమాకు పాటలు కంపోజ్‌ చేయటం ఆనందంగా ఉంది. బిగ్గెస్ట్ ఫ్యాన్‌ మూమెంట్` అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. Also Read: త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయి ఘనవిజయం సాదించింది. ఈ సినిమాలోని ఆడియకు సూపర్బ్ రెస్సాన్స్ రావటంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QUELBj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...