బాలీవుడ్ మ్యాన్లీ హీరో డ్యాన్స్‌కు ఫ్యాన్ కానీ సినీ ప్రేమికుడు ఉండడు. హృతిక్ సినిమా రిలీజ్ అవుతుందటే ఆయన డ్యాన్స్, ఫైట్స్ చూసేందుకు అభిమానులు ఎగబడతారు. తొలి సినిమా నుంచే తన డ్యాన్స్‌తో కోట్ల మందిని అభిమానులుగా మార్చేసుకున్న హృతిక్ కూడా ఓ వ్యక్తి డ్యాన్స్‌కు ఫిదా అయిపోయాడు. ఎయిర్ వాకర్ స్టైల్‌లో చేసిన ఆ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే మైఖేల్ జాక్సన్‌ను చూస్తున్నట్టే ఉంది. ఈ కుర్రాడి డ్యాన్స్ వీడియోను షాశ్ (Shash) అనే వ్యక్తి తన ట్విటర్ పేజ్‌లో షేర్ చేస్తూ హృతిక్ రోఫన్, ప్రభుదేవాలకు ట్యాగ్ చేశాడు. అంతేకాదు ఆ యువ డ్యాన్సర్‌ను పాపులర్ చేయాలని కోరాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన హృతిక్ రోషన్ ఇంత స్మూత్‌గా ఎయిర్ వాక్ చేయటం చూడటం ఇదే మొదటిసారని తెలిపాడు. Also Read: అంతేకాదు అసలు ఈ వ్యక్తి ఎవరు అంటూ తనకు ట్యాగ్ చేసిన వ్యక్తిని ప్రశ్నించాడు హృతిక్. కేవలం హృతిక్ మాత్రమే కాదు ఈ కుర్రాడి డ్యాన్స్‌కు బిగ్ బి కూడా ఫిదా అయ్యాడు. అనసూయ, సునీల్ శెట్టి, అనుపమ్ ఖేర్ లాంటి స్టార్స్ కూడా ఈ వ్యక్తి డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు. మైఖేల్ జాక్సన్ అభిమాని అయిన ఈ వ్యక్తి తన పేరును బాబా జాక్సన్ 2020 అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి అసలు పేరు యువరాజ్ సింగ్ అని, సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిన ఆ వ్యక్తికి ట్విక్ టాక్ దాదాపు పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. అయితే ఏకంగా హృతిక్ లాంటి టాప్ స్టార్ ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తుండటంతో అతడి దశ తిరిగినట్టే అంటున్నారు నెటిజెన్లు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35SEdQR
v
No comments:
Post a Comment