Tuesday, 14 January 2020

Naga Chaitanya ‘లవ్ స్టోరి’ ఫస్ట్ లుక్: ఫిదా పిల్లతో రొమాన్స్.. సమంత రియాక్షన్

అక్కినేని నాగచైతన్య 19 మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ప్రేమ కథా చిత్రాలను ఫీల్ గుడ్‌గా చూపించే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. చైతూకి జోడీగా ఫిదా పోరి సాయి పల్లవి నటించింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫిదా, హ్యాపీడేస్, గోదావరి, ఆనంద్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్‌ని అందించిన శేఖర్ కమ్ముల తాజా చిత్రానికి ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఆయన చిత్రాల మాదిరిగానే తాజా పోస్టర్ కూడా ఫీల్ గుడ్ అనేలా ఉంది. తన ఇష్టసఖుడ్ని కాలర్ పట్టుకుని తగ్గరకు లాక్కుని.. కళ్లు మూసుకుని ఇరు స్వాసల పోట్లాటతో ప్రేమ తన్మయం పొందుతున్నారు. ఈ ఫస్ట్ లుక్‌లో సాయి పల్లవి చాలా క్వాజువల్ లుక్‌లో ఎప్పటిలాగే ఉండగా.. నాగచైతన్య పెరిగిన గెడ్డంతో ‘ప్రేమమ్’, ‘మజిలీ’ చిత్రాల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఫిదా చిత్రంలో సాయి పల్లవిని భానుమతి.. ఒక్కటే పీస్ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించిన శేఖర్ కమ్ముల మరోసారి ఆమెను రిపీట్ చేసి ఈసారి ఎలాంటి హిట్ కొడతారో చూడాలి. కాగా.. ‘ఈ చిత్రంలో ఉన్న సారాంశాన్ని ప్రతిబింబించేలా చెప్పడానికి ఇంతకంటే మంచి టైటిల్ లేదు’ అంటూ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా.. రీ ట్వీట్ చేసి మద్దతు ప్రకటించింది చైతూ రియల్ లవర్ అండ్ లైఫ్ టైం వైఫ్ సమంత. దీంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై మంచి స్పందనలు వస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QPUmlN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...