Wednesday, 8 January 2020

Entha Manchivaadavuraa మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా: ప్రీ రిలీజ్‌లో కళ్యాణ్ రామ్

నందమూరి హీరోగా నటించిన ‘ఎంత మంచి వాడవురా’ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా నందమూరి అభిమానుల కోలాహలంతో ‘ఎంత మంచి వాడవురా’ ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. మా నందమూరి అభిమానులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ముందుగా ఆదిత్య మ్యూజిక్ వారి స్వాగతం పలుకుతున్నా. ఈ చిత్రంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. జనవరి 15న మన సినిమా వస్తుంది. సంక్రాంతి అంటే సినిమా పండుగ.. 9న దర్బార్, 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో మూవీ విడుదల కానున్నాయి. ఈ సంక్రాంతి సినిమాలన్నీ విజయవంతం కావాలని కోరుతున్నా. Read Also: వీటికంటే మా సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని కోరుతున్నా’ అన్నారు కళ్యాణ్ రామ్. నందమూరి అభిమానులు ఈ ప్రీ రిలీజ్‌లో ఎక్కువ గోల చేయడంతో ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్‌ కూడా సరిగా మాట్లాడకుండానే తొందరగా స్పీచ్‌లు ముగించేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qya1G8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...