Wednesday, 8 January 2020

Entha Manchivaadavuraa Pre Release: మా అన్న సినిమాతో పాటు ఆ మూడు హిట్ కావాలి: ఎన్టీఆర్

నందమూవీ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఎంత మంచి వాడవురా’ చిత్రం ఈనెల 15న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకును వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ తన అన్న సినిమాను ఆదరించాలనే.. అలాగే మహేష్, బన్నీ, రజినీకాంత్ చిత్రాలకు మంచి విజయాలను అందించి తెలుగు సినిమా స్థాయిని పెంచాలని కోరారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘మీరు సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా.. లేదంటే వెళిపోతా. ఈ వేడుకలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చిత్ర యూనిట్‌కి ధన్యవాదాలు. కళ్యాణ్ అన్న ఎన్నో వైవిధ్యభరిత చిత్రాలు చేశారు. కాని నాకు ఒక వెలితి ఉండేది. అన్న ఓ మంచి కుటుంబసమేత చిత్రంలో నటిస్తే బాగుండు అనిపించేది. ఆ నా కోరిక ఈ చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ ద్వారా తీరుతుంది. ఆదిత్య మ్యూజిక్‌లో ఈ సినిమా నిర్మించబడటం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో మంచి మంచి నటీ నటులు నటించారు. వీరి సహాయ సహకారాలతో జనవరి 15న మీ ముందుకు రానుంది. మంచి చిత్రాలను ఆదరిస్తారనే పేరు మన తెలుగు ప్రేక్షకులకు ఉంది. ఈసారి కూడా అది నిజం చేస్తారని కోరుతున్నా. మీరంతా ఆనందంలో ఉన్నారు.. ఇదే ఆనందాన్ని మీ ఇంటి వరకూ వెళ్లి పంచుకోండి. ఇక్కడ ఉన్న మీ ప్రాణం మాతో పాటు మీ కుటుంబాలకు చాలా అవసరం. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. ఈ పండగ వాతావరణంలో రిలీజ్ అవతున్న దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు మంచి విజయాలు సాధించి తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా.. జై ఎన్టీఆర్, జై హరిక్రిష్ణ అంటూ స్పీచ్ ముగించారు ఎన్టీఆర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Fv4E4r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...