Wednesday, 8 January 2020

‘ఎంత మంచివాడవురా’ ట్రైలర్: మంచోడన్నారు.. వీడేమో కోసి కారం పెట్టేస్తున్నాడు!

తాతయ్య దగ్గర శివ.. ఊళ్లో సూర్య.. ఈ అమ్మాయి దగ్గర రిషి.. ఇలా ఒక్కో చోట ఒక్కో పేరే, రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. మూడు పేర్లు ఏంటి?? ఆ మూడు రిలేషన్స్ ఎందుకు? ఏమిటి? విషయాలు తెలియాలు తెలియాలంటే ఈనెల 15న థియేటర్స్ రావాల్సిందే అంటున్నాడు కళ్యాణ్ రామ్. వేగేశ్న సతీష్ రచన దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎంత మంచి వాడవురా’ రిలీజ్‌లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతులు మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘’ అనే యాప్ట్‌గా దర్శకుడి టేస్ట్‌కి ఏమాత్రం దూరం కాకుండా ఉంది. ‘శతమానం భవతి’ క్లాసిక్ హిట్‌తో నేషనల్ అవార్డ్ అందుకుని ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంతో పరాజయాన్ని చవిచూసిన వేగేశ్న సతీష్.. మరోసారి పక్కా కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పకనే చెప్పారు. పేరుతో పిలిచేదానికంటే.. బంధుత్వం పిలిచే దానికే ఎమోషన్స్ ఎక్కువ అంటూ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈసారి పూర్తి కుటుంబ కథా చిత్రంతో మెప్పిచే ప్రయత్నాన్ని చేస్తున్నారు. బంధాలు బంధుత్వాలకు విలువ నిచ్చే హీరో.. ఆ హీరో అంటే పిచ్చి నాకు అని వెంటపడే హీరోయిన్.. ఇవ్వడం వాడికి అలవాటు, ఏదైనా తీసేసుకోవడం నాకు అలవాటు అనే విలన్.. ఈ ఎలిమెంట్స్ అన్నీ రొటీన్‌గానే కనిపిస్తున్నా.. కళ్యాణ్ రామ్.. శివ, సూర్య, రిషి మూడు పాత్రలు కథపై ఆసక్తికలిగిస్తున్నాయి. అన్నట్టు క్లైమాక్స్‌లో తన తండ్రి జోలికి వస్తే.. కోరి కారం పట్టేస్తా అన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా జామకాయని ఉపయోగించి చెప్పడం కాస్త డిఫరెంట్‌గా అనిపించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tHS9j2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...