Wednesday, 22 January 2020

Comedian Sunil: కమెడియన్ సునీల్‌కి అస్వస్థత.. హాస్పటల్‌లో వైద్యం

కమెడియన్, హీరో సునీల్‌కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఎక్కువగా యాంటిబయోటిక్ మాత్రలు వేసుకోవడంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది. అయితే బుధవారం రాత్రి ఆయనకు వ్యాధి తీవ్రత పెరగడంతో హుటా హుటిన గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పటల్‌లో జాయిన్ అయ్యారు. సునీల్‌ని పరీక్షించిన డాక్టర్స్ ఆయనకు యాంటిబయోటిక్ మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు గుర్తించారు. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాత్రి నుండి వైద్యం అందించడంతో సునీల్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని ప్రమాదం ఏమీ లేనట్లు తెలస్తోంది. కాగా సునీల్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం విజయవంతం కాగా.. రవితేజ ‘డిస్కో రాజా’లో కీలకపాత్ర పోషించారు సునీల్. ఈ సినిమా రేపు (శుక్రవారం) కానుండగా.. అనారోగ్యంగా కారణంగా ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారు సునీల్. గత ఆదివారం నాడు జరిగిన ‘డిస్కో రాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సునీల్ తన ప్రసంగంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37jhoXT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...