Wednesday, 22 January 2020

‘నిర్భయ’ దోషులున్న జైల్లోనే ఆమెను పెట్టండి: కంగన షాకింగ్ కామెంట్స్

ఎలాంటి విషయాన్నైనా కుండ బద్దలుకొట్టి చెప్పే తత్వం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ది. అందులోనూ ఆమెకు దేశభక్తి ఎక్కువ. దేశంలో జరిగే అన్యాయాలపై ఎప్పుడూ తనదైన శైలిలో పోరాడుతూ ఉంటారు. తోటి నటీనటులు తమ అభిప్రాయాలు వెల్లడించకపోయినా ఆమెకు అస్సలు నచ్చదు. అయితే.. నిర్భయ దోషులపై ఓ సీనియర్ లాయర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఆ నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న తిహార్ జైల్లో ఉరిశిక్ష పడనుంది. అయితే సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్ నిర్భయ దోషుల గురించి మాట్లాడుతూ.. నిర్భయ తల్లి వారిని క్షమించాలని అన్నారు. అంతటి హోదా ఉన్న లాయర్ ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు చేయడంపై యావత్ భారతదేశం కంగుతింది. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందిస్తూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అసలు నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపిన రోజే దోషులను అక్కడికక్కడే కాల్చి చంపేయాల్సింది అని ఎప్పటినుంచో కంగన చెప్తూ వస్తున్నారు. మొత్తానికి వారిని ఉరి తీస్తున్నారని ఎంతో సంతోషించారు. అలాంటి సమయంలో ఇందిరా జైసింగ్ వారికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం కంగనకు ఏమాత్రం నచ్చలేదు. READ ALSO: దీనిపై కంగన స్పందిస్తూ.. ‘ఓ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేసిన వారికి మద్దతు తెలిపే ఇలాంటి మహిళలే అలాంటి రాక్షసులకు జన్మిస్తారు. ఇందిరా జైసింగ్ లాంటివారే పిల్లలను రాక్షసుల్లా పెంచి వారిలో కర్కశత్వాన్ని పెంచుతారు. జైసింగ్‌ను నిర్భయ దోషులు ఉన్న జైల్లో నాలుగు రోజులు పెట్టి చూడండి. అప్పుడు ఆమెకు బుద్ధి వస్తుంది. నిర్భయ దోషులను తిహార్ జైల్లో ఉరివేసే బదులు నడిరోడ్డులో ఉరితీస్తే నేను చాలా సంతోషిస్తాను. అప్పుడు ఇలాంటి వక్ర బుద్ధి ఉండే మగవారిలో ఆడదానిపై చెయ్యి వేయాలన్న ఆలోచన వచ్చినా వెన్నులో వణుకుపడుతుంది. న్యాయస్థానం వేసే శిక్ష ఓ ఉదాహరణ అవ్వనప్పుడు ఆ శిక్ష వేయడం కూడా దండగే’ అని వెల్లడించారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30NM2Xe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...