Wednesday, 22 January 2020

ఎంఎస్‌ నారాయణ వర్ధంతికి హైపర్ ఆది బర్త్ డే విష్.. ఏకేస్తున్న నెటిజన్లు

లెజండరీ కమెడియన్ ఎంఎస్ నారాయణ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు నారాయణను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ శ్రేయాస్ మీడియా తమ సోషల్ మీడియా పేజ్‌‌లో ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పించింది. ఆ ఫొటోను చూసిన ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ తన ఫేస్‌బుక్‌లో అదే ఫొటోను షేర్ చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఫొటోలో ఏం రాసుందో చూసుకుని దానిని పోస్ట్ చేసి ఉంటే బాగుండేది. ఫొటోలో ఎంఎస్ నారాయణ వర్ధంతి అని రాసుంటే.. హైపర్ ఆది ‘హ్యాపీ బర్త్‌డే సర్’ అని పెట్టాడు. ఇంకేముంది.. ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న నెటిజన్స్ ఆదిని ఏకిపారేశారు. విషయం ఏంటో తెలుసుకోకుండా ఏదిపడితే అది పోస్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ తిట్టిపోశారు. ఆ తర్వాత జరిగిన తప్పు తెలుసుకుని వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసి మళ్లీ అదే ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఎంఎస్ నారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటున్నాం’ అని పెట్టాడు. READ ALSO: అయితే తప్పుడు పోస్ట్ పెట్టిన వెంటనే ఆది చూసుకుని ఉంటే దొరికేవాడు కాదేమో. ఆ పోస్ట్ పెట్టిన దాదాపు రెండు గంటల తర్వాత చూసుకున్నాడట. అప్పటికే దాదాపు 600లకు పైగా లైక్స్, కామెంట్స్ వచ్చేశాయి. ఫొటో స్క్రీన్ షాట్స్‌ కూడా వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు ఫొటో మార్చినా ఏం లాభం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ఎంఎస్ నారాయణ. 2015 జనవరిలో అనారోగ్య సమస్యలతో ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RnmsoR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...