Thursday, 9 January 2020

మహేష్‌ బాబు సినిమాకి ఏపీ ప్రభుత్వం బంపరాఫర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న క్రేజీ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. విజయశాంతి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి కానుకగా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందు వస్తోంది ఈ మూవీ. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతినిచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రత్యేక షోలు వేసుకోవడానికి ఆ చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన జగన్ ప్రభుత్వం ప్రత్యేక షోలు వేసుకోవడానికి అంగీకరించింది. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వారం రోజులపాటు అదనంగా రెండు షోలు వేసుకోవచ్చు. అంటే రోజుకి ఆరు షోలు వేస్తారు. ఇంకేముంది.. సూపర్ స్టార్ అభిమానులకే పండగే. Also Read: ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, అజయ్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది. సినిమా నిడివి సుమారు 2 గంటల 40 నిమిషాలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tEe5Mf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...