Thursday, 9 January 2020

AP Capital: అమరావతి రైతుల్లారా.. మీకు నేనున్నా: సింగర్ స్మిత షాకింగ్ పోస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని లెక్కలు తేలకపోగా రైతులు ఉద్యమబాట పట్టారు. ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో రైతులు, మహిళలు ఆందోళన బాట పట్టారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనలపై రాజధాని ప్రాంతంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని గత 23 రోజులుగా దాదాపు 29 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీరికి ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపడంతో రాజధాని ప్రాంతంలో ఆందోళనలు ఉదృతమయ్యాయి. ఈ తరుణంలో రాజధాని ప్రాంతానికి చెందిన ప్రముఖ సింగర్, నటి స్మిత షాకింగ్ పోస్ట్‌ను షేర్ చేసి రాజధాని ప్రాంత రైతులకు మద్దతు తెలిపారు. ‘ఇది చాలా విచారకరం, రాజధాని ప్రాంత రైతుల వేదన చేస్తుంటే గుండె బద్దలౌతోంది. ఆ బాధ తట్టుకోలేనిది. రైతుల పట్ల అస్సలు సానుభూతి చూపించడకుండా, మేం బాగానే ఉన్నాం కదా ఎవరికో ఏదో జరిగితే మాకేంటి అకునేవాళ్లను చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. అమరావతి రైతులకు అండగా నేను ఉన్నాను. మీకు న్యాయం జరగాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మీ బాధను పంచుకుంటున్నాను. వాళ్లకు అండగా నిలబడితే ఏమైనా చేయొచ్చు’ అంటూ ట్వీట్ చేసింది .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3042tOB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...