రాజకీయాలతో సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీకి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్‌ను ప్రారంభించాడు పవన్. ఈ సినిమాతోపాటు దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలో పవన్‌కు జోడిగా ఓ ఫేడ్ అవుట్ హీరోయిన్‌ను తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ దొంగగా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. పవన్ ఇమేజ్ క్రేజ్ తగ్గ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఓ సందేశాత్మక కథను క్రిష్ సిద్ధం చేశాడట. పింక్ రీమేక్‌తోపాటే ఈ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. పింక్ రీమేక్‌లో ప్రధాన పాత్రల్లో అంజలి, నివేదా థామస్‌లతో పాటు మల్లేశం ఫేం అనన్య పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథ పరంగా ఈ సినిమాలో పవన్‌కు హీరోయిన్ ఉండదని తెలుస్తోంది. అయితే క్రిష్ సినిమా మాత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావటంతో పవన్‌కు జోడిగా ఓ అందాల భామను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్ పవన్‌కు జోడిగా ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. గతంలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాలో ప్రగ్యా హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌లో ప్రగ్యా ఓ క్యారెక్టర్ చేసింది. ఇప్పుడు పవన్ సినిమాకు కూడా క్రిష్, ప్రగ్యానే హీరోయిన్‌గా తీసుకోవాలనుకోవటం హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనూ క్రిష్, ప్రగ్యాల స్నేహంపై మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి పవన్ సినిమా కోసం క్రిష్, ప్రగ్యానే తీసుకుంటున్నాడన్న వార్తలు రావటంతో ఫిలిం సర్కి్ల్స్‌లో ఆసక్తికరంగా మారింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2upW98i
v
No comments:
Post a Comment