Thursday, 23 January 2020

మెగా హీరో రేంజ్‌.. తొలి సినిమా రిలీజ్‌ కాకుండానే..!

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పది మంది హీరోలకు వరకు వెండితెర మీద సందడి చేస్తున్నారు. వీళ్లలో కొంత మంది స్టార్ హీరోలుగా దూసుకుపోతుంటే మరి కొందరు సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో హీరో చేరబోతున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు హీరోగా పరిచయం అవుతున్నాడు. వైష్ణవ్‌ తొలి సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నారు చిత్రయూనిట్. పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సుకుమార్, సుకుమార్ రైటింగ్స్‌ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో బుచ్చిబాబు సనా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. Also Read: తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్‌ హీరోగా మరో సినిమా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకురాలు దర్శకత్వంలో వైష్ణవ్‌ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను మహానటి లాంటి జాతీయ స్థాయి చిత్రాన్ని రూపొందించిన స్వప్నాదత్‌, ప్రియాంక దత్‌లు నిర్మించనున్నారు. అయితే నందిని ఈ సినిమాతో పాటు సమంత ప్రధాన పాత్రలో మరో సినిమాను చేసే ప్లాన్‌లో ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా సెట్‌ అయితే ఆ సినిమాను నందిని పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uv2GhV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...