Thursday, 23 January 2020

SSMB27: ఆ హీరోయినే కావాలంటున్న నమ్రత

సూపర్‌స్టార్ 27వ సినిమా మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. ఈలోగా మహేష్ ఫ్యామిలీతో విహారయాత్రలను ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న టాపిక్‌పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని మహేష్ బాబును అడిగితే.. ‘నాకు తెలీదు. ఫ్యాన్సే హీరోయిన్‌ని వెతికి పెట్టాలి’ అని సెటైర్ వేశారు. అయితే SSMB27 సినిమాలో హీరోయిన్ గురించి మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఓ నిర్ణయానికి వచ్చారట. సినిమాలో కియారా అడ్వాణీ అయితే బాగుంటుందని నమ్రత అభిప్రాయపడ్డారట. ఇదే విషయాన్ని టీంకు చెబితే వారు కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. మహేష్, కియారా కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తన తర్వాతి సినిమాను మహేష్ వంశీ పైడిపల్లితో తీస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘మహర్షి’ సినిమా కోసం పనిచేశారు. అది కూడా మంచి సక్సెస్ అందుకుంది. అందుకే మరోసారి వంశీతో కలిసి పనిచేయాలని మహేష్ అనుకున్నారు. అంతేకాదు వంశీ సినిమా తర్వాత తన డేట్లను అనిల్ రావిపూడికి ఇస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ అన్నారు. READ ALSO: అయితే ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు కాబట్టి మహేష్ సరదాగా అన్నారా? లేక నిజంగానే అనిల్‌తో మరో హిట్ కొట్టాలని అనుకుంటున్నారా తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్‌ను ఎంచుకున్నారు. ఇకపోతే ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వరుసగా మూడో బ్లాక్ బస్టర్‌ను అందుకున్నారు మహేష్. ఇప్పటివరకు ఈ సినిమా రూ.200 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TOLK0B
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...