Thursday, 16 January 2020

అల `వైకుంఠపురము` ఎవరిదో తెలుసా?

స్టైలిష్‌ స్టార్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠరములో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయారు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా టైటిల్‌లో వైకుంఠపురము అనేది ఓ ఇంటికి పెట్టుకున్న పేరు. మల్టీ మిలియనీర్‌ అయిన సచిన్‌ కేడ్కర్‌ ఆయన కూతురు టబు, అల్లుడు జయరామ్‌ ఇతర కుటుంబ సభ్యులు నివసించే విలాసవంతమైన భవంతి వైకుంఠపురము. సినిమాకు ఈ ఇల్లు ఎంతో కీలకం కావటంతో అంత గొప్పగా కనిపించే ఇంటి కోసం చిత్ర దర్శక నిర్మాతలు చాలా కాలం వెతికారట. Also Read: అయితే చివరగా ప్రముఖ తెలుగు టీవీ ఛానల్‌ ఓనర్‌ నరేంద్రనాథ్‌ చౌదరి బంధువుల (కూతురి అత్తగారి) ఇంటి గురించి త్రివిక్రమ్‌కు తెలిసింది. ఆ ఇంటిని చూసిన త్రివిక్రమ్‌ తన కథకు ఈ ఇల్లు కరెక్ట్ అని భావించి అక్కడ షూటింగ్‌ చేసేందుకు ఇంటి యజమానులను ఒప్పించాడు. అలా 20 రోజుల పాటు ఆ ఇంటి పరిసరాల్లో షూటింగ్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బన్నీ ఆ ఇంటి ఇంటీరియర్‌ వసతులకు ముగ్ధుడైపోయాడట. అందుకే తాను కూడా అధునాతన వసతులతో ఓ భవంతి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. థ్యాంక్స్‌ మీట్‌లో ఈ విషయాన్ని వేదిక మీదే చెప్పాడు బన్నీ. Also Read: బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించిన ఈ సినిమాలో టబు, సుశాంత్‌, జయరామ్‌, నివేదా పేతురాజ్‌, సచిన్‌ కేడ్కర్‌, హర్షవర్ధన్‌లు కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి పండక్కి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తూ సత్తా చాటుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NtE8wu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...