Thursday, 16 January 2020

RRR తరువాత ఎన్టీఆర్‌ సినిమా.. ఆ దర్శకుడితోనే!

టాలీవుడ్‌ యంగ్ జనరేషన్‌లో టాప్‌ హీరోగా కొనసాగుతున్న ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తయిన తరువాత ఎన్టీఆర్‌ చేయబోయే సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఆ తరువాత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కావు. అందుకే ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఏ దర్శకుడితో ఎలాంటి సినిమా చేస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read: తాజాగా ఎన్టీఆర్‌ తదుపరి చిత్రానికి సంబంధించి ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆర్‌ఆర్ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ నటుడిగా ఎన్టీఆర్‌ స్థాయిని పెంచింది. అందుకే మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నాడు ఎన్టీఆర్‌. అంతేకాదు ఈ సినిమాను వరుసగా త్రివిక్రమ్‌తోనే సినిమాలు నిర్మిస్తు్న హారికా హాసిని క్రియేషన్స్‌ నిర్మాత రాధాకృష్ణతో పాటు ఎన్టీఆర్‌ అన్న, హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. Also Read: ఇటీవల త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించింది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో త్రివిక్రమ్‌ ఖాతాలో మరో సూపర్‌ హిట్ పడటంతో ఎన్టీఆర్‌ అభిమానులు తదుపరి చిత్రంపై మరింత ఆసక్తికనబరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Rlwx4b
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...