Wednesday, 15 January 2020

అల్లు అర్జున్‌కు విలన్‌గా విజయ్ సేతుపతి!

ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఎందుకంటే, బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం ఒక సెన్సేషన్. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా. ఆ తరవాత వచ్చిన ‘ఆర్య 2’ అంత పెద్ద విజయాన్ని అందుకోలేకపోయినా మంచి చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో మూడో చిత్రం వస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే, ఇప్పుడు ఈ ఆసక్తిని మరింత పెంచే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదేంటంటే.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్నారని. తమిళంలో సోలో హీరోగా సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి.. స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తున్నారు. ‘సైరా’ సినిమాలో తమిళ యోధుడుగా కనిపించారు. ప్రస్తుతం దళపతి విజయ్ చిత్రం ‘మాస్టర్’లో విలన్‌గా నటిస్తున్నారు. వర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఈ నటుడు.. సుకుమార్ సినిమాలో బన్నీకి విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. Also Read: ప్రస్తుతానికి ఇది రూమరే అయినా ఇదే నిజం అని ఇండస్ట్రీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ సినిమా కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుంది. షూటింగ్ చాలా వరకు అడవిలోనే ఉంటుందట. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్‌ ఫిబ్రవరిలో ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్ నుంచి బన్నీ షూటింగ్‌లో పాల్గొంటారు. విజయ్ కూడా త్వరలోనే సెట్స్‌లో జాయిన్ అవుతారట. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38lLQRB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...