Wednesday, 15 January 2020

మీ 25 సినిమాల్లో ఎప్పుడూ చూడలేదు.. మహేష్‌కి అనిల్ ఫ్యామిలీ మెసేజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈనెల 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురపిస్తోంది. ఈ సినిమా విజయవంతం కావడం పట్ల మహేష్ బాబుతో పాటు చిత్ర యూనిట్ మొత్తం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబసభ్యులు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. అందుకే, అనిల్ రావిపూడికి ఇంత మంచి అవకాశం ఇవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన మహేష్‌ బాబుకు వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ రావిపూడి ఫ్యామిలీ మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన వీడియోను నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘మా దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబం!! ఇంత తీయని సందేశం పంపినందుకు కృతజ్ఞతలు. అనిల్ సర్, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, నిజాయతీ, ప్యాషన్‌కు మా జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మహేష్ బాబు రుణపడి ఉంటారు. త్వరలోనే మరో బ్లాక్‌బస్టర్ ఇస్తారని ఆశిస్తున్నాం’’ అని నమ్రత తన పోస్ట్‌లో పేర్కొన్నారు. Also Read: కాగా, ఈ వీడియోలో అనిల్ రావిపూడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘‘మహేష్ బాబు గారికి నమస్కారం. అనిల్ రావిపూడి ఫ్యామిలీ తరఫు నుంచి మీ కుటుంబం అంతటికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బ్లాక్‌బస్టర్‌ కా బాప్ వచ్చేసింది ముందుగానే మనకి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేం మీ మీద ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటాం సార్. మహేష్ బాబు గారు మీ 25 సినిమాల్లో ఎప్పుడూ చూడలేదు. డ్యాన్స్ అలా వేశారు. ఇరగదీస్తున్నారు. థియేటర్లు మొత్తం హౌస్‌ఫుల్’’ అని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TtHpzU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...