పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ‘సత్యాగ్రహి’ అనే టైటిల్‌తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు అదే టైటిల్‌తో, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల స్ఫూర్తితో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సత్యాగ్రహి’ చిత్రాన్ని శ్రీ భవిత క్రియేషన్స్ పతాకంపై గంగారెడ్డి నిర్మిస్తుండగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం విడుదల చేశారు. పవన్ కళ్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమాజంపై యవత బాధ్యతతో ఉండాలని చెబుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిన నలుగురు యువకులు సమాజాన్ని మార్చే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథాంశం. ఇక ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆసక్తికరంగానే ఉంది. పిడికిలి బిగించిన పవన్, ఆయన ముందు ఉన్న కొంత మంది అభిమానుల క్యారికేచర్‌ను పోస్టర్‌లో ఉంచారు. టైటిల్ డిజైన్ అయితే బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. Also Read: ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. శర్మ, సురేష్ గంగుల పాటలు రాశారు. శ్రీకాంత్ ఎడిటర్. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ కృష్ణ చైతన్య.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QGAX5k
v
No comments:
Post a Comment