Wednesday, 1 January 2020

యథార్థ సంఘటనలతో ‘క్రాక్’.. కిర్రాక్ అనిపిస్తోన్న రవితేజ పోలీస్ లుక్

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్‌’. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ర‌వితేజ ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుద‌లైన టైటిల్ పోస్టర్‌‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా, న్యూ ఇయర్ సందర్భంగా రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్ వేసుకుని, చేతిలో గోలీసోడా బుడ్డిని ప‌ట్టుకుని ఒక కంటికి అడ్డంగా పెట్టుకున్న ఇంటెన్స్ లుక్‌లో ర‌వితేజ అదిరిపోయారు. Also Read: తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ ఏడాది స‌మ్మర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. స‌ర‌స్వతి ఫిలిమ్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ‘మెర్సల్‌’, ‘బిగిల్’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన జి.కె.విష్ణు ఈ సినిమాకు కెమెరామేన్‌గా పనిచేస్తున్నారు. స‌ముద్రఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీ ప్రసాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాక‌ర్‌, వంశీ చాగంటి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2toHlWQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...