Wednesday, 1 January 2020

‘శ్రీరెడ్డి దొరికిపోయింది’.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్!

శ్రీరెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరంలేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాలీవుడ్‌లోని పెద్దపెద్ద వాళ్లపై తీవ్ర ఆరోపణలు చేసిందామె. టాలీవుడ్‌లో ఒక ఊపు ఊపేసి ప్రస్తుతం చెన్నైలో సేదతీరుతోంది. అక్కడి నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా కామెంట్‌లు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇంత వివాదాస్పదమైన నటి పేరుపై ఇప్పుడో సినిమా వస్తోంది. ఆర్యన్‌, ఉపాసన జంటగా రాహుల్‌ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. మానవ మృగాలకు అనేది ఉపశీర్షిక. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ సినిమాతో శ్రీరెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా టైటిల్‌లో ఆమె పేరును వాడటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also Read: పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక అమ్మాయి చేతిలో కత్తి, ఆమె ముఖంపై రక్తపు మరకలు, ఆమె ముఖంలో కోపం చూస్తుంటే ఇదేదో మగ మృగాలపై రివేంజ్ స్టోరీలా అనిపిస్తోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్‌ మూవీస్‌ పతాకంపై డి. వెంకటేష్‌ నిర్మిస్తున్నారు. గణేశ్‌ రాఘవేంద్ర సంగీతమందిస్తున్నారు. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36hihQh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...