Wednesday, 1 January 2020

రవిబాబు కొత్త సినిమా ‘క్రష్’.. కుర్రాళ్లకు పండగే

సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు రవిబాబు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. ‘అల్లరి’ సినిమాతో దర్శకుడిగా మారి తొలి చిత్రంతోనే తన మార్కును చూపించారు. ఆ తరవాత ‘నచ్చావులే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. కేవలం ఒకే జోనర్‌లో కాకుండా రవిబాబు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ‘అల్లరి’, ‘నచ్చావులే’ సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన రవిబాబు.. ‘అన‌సూయ‌’, ‘అమ‌రావ‌తి’, ‘అవును’, ‘అవును 2’ వంటి హారర్ సినిమాలతో భయపెట్టారు. ఆఖరికి పందిని ప్రధాన పాత్రగా పెట్టి ‘అదుగో’ అనే సినిమాను చేశారు. దిల్ రాజుతో కలిసి ఇటీవల ‘ఆవిరి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలు ఘోరంగా విఫలమయ్యాయి. అయితే, ఇప్పుడు మరో సినిమాను ప్రకటించారు రవిబాబు. సినిమా టైటిల్ ‘క్రష్’. Also Read: తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై తన దర్శకత్వంలో ర‌విబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూత‌న సంవత్సరం సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యువతను టార్గెట్ చేస్తూ తీస్తున్నట్టు అర్థమవుతోంది. బికినీలో ఒక అమ్మాయి బీచ్‌లో నడుస్తూ వస్తుంటే ముగ్గురు కుర్రాళ్లు ఆమెను చూసి సొంగ కారుస్తున్నట్టు పోస్టర్‌లో చూపించారు. మొత్తం మీద గత చిత్రాలతో సంబంధం లేకుండా మరో కొత్త జోనర్‌ను రవిబాబు ఎంపిక చేసుకున్నారు. రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా జ‌న‌వ‌రి 24 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే, సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వర‌లోనే సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్రక‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ML0qcR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...