డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు అంతా సెలబ్రేషన్ మోడ్‌లో ఉంటారు. పాత ఏడాదికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు. సెలబ్రిటీలకైతే అయితే ఈ సెలబ్రేషన్స్ మరింత రంజుగా ఉంటాయి. పార్టీలు, పబ్‌లు, బీచ్‌లో నైట్ పార్టీలు, విదేశాల్లో సంబరాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కోటి చూసుకుంటారు. అయితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక్కడ కాదు.. బ్యాంకాక్‌లో. ప్రస్తుతం వాళ్లు అక్కడే ఉన్నారు. తన భర్త అల్లు అర్జున్‌తో కలిసి న్యూ ఇయర్ పార్టీలో తీసుకున్న ఫొటోను స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ ఫొటోలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి చాలా ట్రెండీగా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ల డ్రెస్సింగ్ వెస్టరన్ కల్చర్‌ను తలపిస్తోంది. బన్నీ బ్లూ కలర్ టీషర్ట్, వైట్ కలర్ షార్ట్స్‌లో ఉన్నారు. ఇక స్నేహారెడ్డి జిగేల్‌మనే పొట్టి గౌనులో మెరిశారు. See Photo Story: కాగా, ప్రస్తుతం బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిజీగా ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. శ్రీమతి మమత సమర్పణలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ విడుదల తేదీ మారే అవకాశముందని అంటున్నారు. జనవరి 10 తేదీని చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని టాక్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2toj6rO
v
No comments:
Post a Comment