Thursday, 2 January 2020

కేఎల్ రాహుల్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ తండ్రి

2019లో పలువురు సినీ ప్రముఖులు ఓ ఇంటివారయ్యారు. ఇక 2020 క్రికెటర్ల హవా నడిచేలా ఉంది. ఇప్పటికే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.. బాలీవుడ్ నటి నటాషా స్టాన్కోవిచ్‌ను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించేశాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ వంతు వచ్చింది. కొంతకాలంగా రాహుల్ బాలీవుడ్ నటి ఆథియా శెట్టితో తిరుగుతున్నాడు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టడం ఎక్కువైంది. ఇంతకుముందు ఎవ్వరికీ కనిపించకుండా తిరిగేవారు. ఇప్పుడు మీడియా ఉన్నా మాకేం భయం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే దీని గురించి ఆథియా కానీ రాహుల్ కానీ ఏమీ స్పందించలేదు కానీ సునీల్ శెట్టి మాత్రం వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘నాకు, నా భార్యకు మా పిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి వారు ఎవరినైతే ఇష్టపడతారో వారు కూడా మాకు ఇష్టమే. ప్రొఫెషన్ కంటే జీవితంలో ఎంత హ్యాపీగా ఉన్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ఆ సంతోష ఘడియలనే మర్చిపోతున్నారు. ఈరోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో కాదు వారు ఇష్టపడే వారితోనూ స్నేహంగా ఉండాలి. నా కుమారుడు అహాన్ గర్ల్‌ఫ్రెండ్‌ అంటే నాకూ ఇష్టమే. ఆథియా కూడా ఎవరినైతే ఇష్టపడుతోందో అతనూ నాకు ఇష్టమే. నాకు ఆ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. నాకు తెలిసి అహన్, ఆథియా ఎవరినైతే ఇష్టపడతారో వారిద్దరూ మా కుటుంబంలో చాలా సులువుగా కలిసిపోతారు’ అని తెలిపారు. READ ALSO: ఇంకేముంది.. సునీల్ శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక దోబూచులాటలు లేకుండా రాహుల్, ఆథియా తమ ప్రేమ విషయాన్ని మీడియా ముందు బయటపెట్టడమే ఆలస్యం. న్యూ ఇయర్ సందర్భంగా రాహుల్, ఆథియా కలిసి వారి స్నేహితులతో థాయ్‌ల్యాండ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35hIk8K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...