సాధారణంగా సినీ సెలబ్రిటీలు పరిచయం ఉన్నవారితో, లేకపోతే కోస్టార్స్‌తోనో ప్రేమలో పడతారు. కానీ జీవితంలో ఓ తోడు కోసం డేటింగ్ యాప్స్‌లో ఖాతాలు తెరవడంలాంటివి చేయరు. కానీ హాలీవుడ్ నటి మాత్రం ఇందుకు విరుద్దంగా ఉన్నారు. జీవిత భాగస్వామి కోసం బంబుల్ అనే డేటింగ్ యాప్‌లో ఖాతా తెరిచేశారు. ఈ బంబుల్ అనేది గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రాకు చెందిన యాప్. ఈ యాప్‌లో షారోన్ ఖాతా తెరవగానే బంబుల్ నిర్వాహకులు కూడా నమ్మలేకపోయారు. ఎవరో ఆమె పేరుతో ఫేక్ అకౌంట్ తెరిచారని అనుకుని బ్లాక్ చేసేశారు. ఆ తర్వాత షారోన్ ట్విటర్ ద్వారా బంబుల్‌కి రిక్వెస్ట్ పెట్టింది. ‘యాప్‌లో ఖాతా తెరిచింది నేనే. దయచేసి నన్ను బ్లాక్ చేయకండి’ అని పేర్కొంది. దాంతో బంబుల్ నిర్వాహకులు ఆమె ఖాతాను రీస్టోర్ చేస్తామని చెప్పారు. ఇంకేముంది.. డేటింగ్ యాప్‌లోకి ఓ హీరోయిన్ రావడంతో కుర్రాళ్లంతా పండుగ చేసుకుంటున్నారు. నేను డేటింగ్‌కి తీసుకెళ్తానంటే నేను తీసుకెళ్తానంటూ ట్విటర్‌లో తెగ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. అయితే బంబుల్ తన ఖాతాను ఇంకా రీస్టోర్ చేయలేదని షారోన్ మళ్లీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన హాలీవుడ్ నటుడు సిమీ లియూ డేట్‌కి వెళ్దామని ప్రపోజ్ చేశాడు. READ ALSO: అయితే ఇందుకు షారోన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం షారోన్ వయసు 60 ఏళ్లు. ఈ వయసులో ఓ తోడు కావాలని అనుకుంటున్నారు. అయినా కూడా చాలా మంది నుంచి షారోన్‌కు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. 2014లో ప్రియాంక చోప్రా ఈ డేటింగ్ యాప్‌ను ప్రారంభించారు. ఇది కేవలం అమ్మాయిల కోసమే. అబ్బాయిలు పెట్టే రిక్వెస్ట్‌లు అమ్మాయిలు ఓకే చేస్తేనే వారితో డేటింగ్‌కి వెళ్లొచ్చు. కానీ ఈ యాప్‌లో అబ్బాయిలు అమ్మాయిలకు రిక్వెస్ట్‌లు పంపలేరు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sF0T9E
v
No comments:
Post a Comment