విభిన్న పాత్రలతో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సౌత్ స్టార్ హీరో మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. గురు సినిమాతో దర్శకురాలిగా ఆకట్టుకున్న సుధా కొంగర దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ! సినిమాలో నటిస్తున్నాడు సూర్య. జేబులో 6000 రూపాయలతో విమానాలు తయారు చేసే కంపెనీ పెట్టాలన్న ఆశయంతో ఊరు వదిలి వచ్చే యువకుడిగా కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. Also Read: ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లోనే కథ మొత్తం రివీల్ చేసేశారు చిత్రయూనిట్. సూర్య మార్క్ వర్సటైల్ యాక్టింగ్, డిఫరెంట్ లుక్స్‌తో పాటు జీవీ ప్రకాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత హైప్ తీసుకువచ్చింది. శిఖ్యా ఎంటర్‌టైన్మెంట్స్ తో కలిసి సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అపర్ణ బాలమురళి, పరేశ్ రావల్, ఊర్మశి, వివేక్ ప్రసన్న, కాళీ వెంకట్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ఇతర వివరాలు వెల్లడించనున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZWHyNe
v
No comments:
Post a Comment