Tuesday, 7 January 2020

బ్రేకప్‌ వార్తలపై స్పందించిన లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌, లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు సంబంధించిన ఓ వార్త కొద్ది రోజులుగా మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో మునిగి తేలిన తరువాత వారికి బ్రేకప్‌ చెప్పేసింది. ప్రస్తుతం ఈ భామ తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో ఉంది. ఏ మాత్రం తీరిక దొరికినా ఈ జంట పక్షులు విదేశాల్లో వాలిపోతున్నారు. అయితే కొద్ది రోజులుగా విఘ్నేష్‌తోనూ నయన్‌ దూరంగా ఉంటుందన్న వార్త కోలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా న్యూ ఇయిర్‌ వేడుకల సందర్భంగా నయన్‌ ఒంటరిగా ఉన్న ఫోటోను ట్వీట్‌ చేయటంతో నయన్‌, విఘ్నేష్‌లు విడిపోయారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై డైరెక్ట్‌గా స్పందించకపోయినా తన ప్రేమ వ్యవహారం గురించి అభిమానులకు క్లారిటీ ఇచ్చింది నయన్‌. Also Read: తొలిసారిగా నిర్వహించిన జీ సినీ అవార్డ్స్‌ తమిళ్‌ 2020 వేడుకలో పాల్గొన్న నయన్‌ విఘ్నేష్‌తో తన ప్రేమ వ్యవహారం గురించి బహిరంగంగా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ వేడుకలో మోస్ట్ ఫేవరెట్‌ యాక్ట్రస్‌, ఇన్స్‌పైరింగ్‌ విమెన్‌ ఆఫ్‌ ద ఇండియన్‌ సినిమా అవార్డులను అందుకుంది నయన్‌. ఈ వేడుకలో కూడా నయన్‌ ఒంటరిగానే పాల్గొంది. అయితే వేదిక మీద తాను ఇంకా విఘ్నేష్‌ ప్రేమలోనే ఉన్ననని చెప్పింది నయన్‌. అవార్డ్‌ అందుకున్న నయన్‌ ముందుగా తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన తరువాత తన ప్రియుడి గురించి మాట్లాడింది. `విఘ్నేష్‌ ప్రేమలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను నా కలలను సాకారం చేసుకు విఘ్నేష్‌ ఎంతో సాయం చేస్తున్నాడు` అంటూ చెప్పింది. దీంతో నయన్‌, విఘ్నేష్‌లు విడిపోయారన్న వార్తలకు చెక్‌పెట్టినటైంది. Also Read: నయనతార హీరోయిన్‌గా నటించిన దర్బార్‌ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకుడు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZX3ubf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...