Tuesday, 7 January 2020

‘సరిలేరు నీకెవ్వరు’ ఇంటర్వెల్ బ్యాంగ్.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ కమర్షియల్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే, విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. చిత్ర యూనిట్ ఓవైపు ప్రమోషన్లతో బిజీగా ఉంటే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇండస్ట్రీ నుంచి బయటికి వస్తున్నాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందట. ఫస్టాఫ్ అంతా కామెడీ ట్రాక్‌తో సాగే సినిమా.. ఇంటర్వెల్ నుంచి టర్న్ తీసుకుంటుందట. అందుకే, ఇంటర్వెల్ బ్యాంగ్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారట దర్శకుడు అనిల్ రావిపూడి. Also Read: కర్నూలులోని కొండా రెడ్డి బురుజు (సెట్ వేశారు) ముందు మంచి మాస్ ఫైట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుందట. ‘మనదగ్గర బేరాలేవమ్మా’ అని మహేష్ టీజర్‌లో చెప్పిన డైలాగ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వస్తుందని టాక్. ఈ ఫైట్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కంపోజ్ చేశారని తెలిసింది. ఈ ఫైట్ మాత్రం సినిమాకే హైలైట్ అంటున్నారు. ఫస్టాఫ్ కామెడీగా, సెకండాఫ్‌ను మంచి యాక్షన్ ఎలిమింట్స్‌తో సీరియస్‌గా నడిపించారట దర్శకుడు. సెకండాఫ్‌లో యాక్షన్ ఎక్కువగా ఉన్నా దానిలో కూడా హాస్యాన్ని బాగానే పండించారట. మొత్తంగా ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ మంచి కమర్షియల్ మూవీ అవుతుందని, ఫ్యామిలీతో థియేటర్‌లో హాయిగా చూసే సినిమా అని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2s1ZOIJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...