Monday, 20 January 2020

రౌడీ జోడి జాన్వీ కాదు.. కానీ స్టార్ వారసురాలే!

సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొడ హీరోగా ఫుల్‌ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాను పూర్తి చేసిన విజయ్‌, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నెక్ట్స్‌ సినిమాను ప్రారంభించాడు. మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఫైటర్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమా కావటంతో ఈ సినిమాను హీరోయిన్‌ బాలీవుడ్‌ నటి అయితే బిజినెస్‌ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. Also Read: ముందుగా ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ నటిస్తుందన్న ప్రచారం జరిగింది. గతంల జాన్వీ కూడా విజయ్‌ దేవరకొండ తన ఫేవరెట్ అంటూ ప్రస్థావించటంతో జాన్వీ, విజయ్‌ జోడిగా నటించటం కన్‌ఫార్మ్‌ అని భావించారు. కానీ తాజా సమచారం ప్రకారం ఈ సినిమాలో జాన్వీ నటించటం లేదట. అయితే జాన్వీ కాకపోయినా బాలీవుడ్ నటినే హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్న చిత్రయూనిట్ మరో స్టార్‌ వారసురాలిని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంకీ పాండే వారసురాలిగా స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2 సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది అనన్య పాండే. ఇప్పటికే ఈ భామకు పూరి కథ కూడా వినిపించాడన్న ప్రచారం జరుగుతోంది. ఫైటర్‌కు జోడి అనన్య నేనా, కాదా అన్న విషయం తెలియాలంటే మాత్రం అఫిషియల్‌ ఎనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2G36uJU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...