Sunday, 12 January 2020

సెన్సేషనల్.. ‘ఇస్మార్ట్ శంకర్’కు అవార్డుల పంట

ఎనర్జిటిక్ స్టార్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన సెన్సేషనల్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. పూర్తి మాస్ కంటెంట్‌తో అందులోనూ రామ్ సరికొత్త మేనరిజంతో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోలేకపోయినా ప్రేక్షకుల ఆదరణను మాత్రం చూరగొంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కిందటేడాది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. హీరో రామ్ కూడా ఈ సినిమాలో చాలా రఫ్‌గా అసలు సిసలు పూరి హీరోగా కనిపించారు. అంతేకాదు, తెలంగాణ యాసలో లౌడ్ సౌండ్‌తో డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు. దీనికి తోడు మణిశర్మ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చాలా కాలం తరవాత ఆయన పాటలు జనంలోకి బాగా వెళ్లిపోయాయి. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విజయంతో వీరిద్దరి బ్యాంక్ ఖాతాల్లోకి కాసులు బగా వచ్చి చేరాయి. వీరికి కాసుల వర్షం కురిపించిన ఈ సినిమానే అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. Also Read: తాజాగా జీ ఛానెల్ అవార్డులను ప్రకటించింది. ‘జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020’ ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. అన్నీ సెన్సేషనల్ అవార్డులే. బెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ అవార్డును పూరి జగన్నాథ్ అందుకున్నారు. బెస్ట్ సెన్సేషనల్ అవార్డు రామ్‌కు దక్కింది. ఇక బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డును ఛార్మి, బెస్ట్ మ్యూజిక్ అవార్డును మణిశర్మ గెలుచుకున్నారు. బెస్ట్ సెన్సేషనల్ మూవీ అవార్డు కూడా ఈ చిత్రానికే దక్కింది. మొత్తంగా చూసుకుంటే ఐదు అవార్డులను కొల్లగొట్టింది. తమ చిత్రానికి ఐదు అవార్డులు రావడం పట్ల పూరి, రామ్, ఛార్మి ఆనందం వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TgXgkZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...