Sunday, 12 January 2020

బావా.. థాంక్యూ వెరీ మచ్: ఎన్టీఆర్ ట్వీట్‌కు బన్నీ రెస్పాన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. టబు, జయరాం, సచిన్ ఖేడేకర్, నివేతా పేతురాజ్, సుశాంత్, సునీల్, నవదీప్ ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. శ్రీమతి మమత సమర్పణలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. తొలిరోజే ‘అల వైకుంఠపురములో’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. సినిమాను జనంలోకి మరింతగా తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. అల్లు అర్జున్‌ నటనను కొనియాడుతూ, త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ ఆదివారం ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్‌ను బావ అని సంబోధిస్తూ అభినందనలు తెలిపారు. Also Read: ‘‘అల్లు అర్జున్ అద్భుతమైన నటన, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మహాద్భుతమైన రచన ‘అల వైకుంఠపురములో’ని గొప్ప చిత్రంగా మలిచాయి. బావ, స్వామికి అభినందనలు. అలాగే, వీళ్లకి దన్నుగా అద్భుతంగా నటించిన మురళీ శర్మ గారికి ధన్యవాదాలు. తమన్ అందించిన అద్భుతమైన సంగీతం సినిమాకు ప్రధాన బలం. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇంత మంచి సినిమాను అందించినందుకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు’’ అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందించారు. ‘‘బావా! థాంక్యూ వెరీ మచ్. నీతో మాట్లాడితే చాలా బాగుంటుంది. త్వరలోనే కలుద్దాం’’ అని బన్నీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య అందులోనూ రెండు బడా ఫ్యామిలీలకు చెందిన హీరోల మధ్య ఇలాంటి చర్చ చోటుచేసుకోవడం నిజంగా ఆసక్తికరం. అందుకే, ఇటు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ట్వీట్లను తెగ రీట్వీట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Raxe0b
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...