Sunday, 12 January 2020

పోసాని ఐ లవ్ యూ.. కులం పేరుతో మనల్ని విడగొట్టారు: పృథ్వీ చెప్పుతీసి మరీ క్షమాపణ

తనపై వచ్చిన ఆరోపణలు నిజమని రుజువని తేలితే చెప్పుతో కొట్టమన్నారు నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ . ఒక మహిళతో తాను రాసలీలలు నడుపుతున్నానంటూ వైరల్ అవుతున్న ఆడియో టేప్ ఫేక్ అని.. ఇదంతా కుట్రపూరితరంగా జరిగిందన్నారు పృథ్వీ. ఈ ఇష్యూపై అసలు నిజం తేలేవరకూ నైతిక బాధ్యత వహిస్తూ.. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు పృథ్వీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఇష్యూపై వివరణ ఇస్తూ ఆదివారం నాడు హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు పృథ్వీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై పోసాని క్రిష్ణమురళి చేసిన కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. ‘నేను రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్‌లు అన్నానని మా మిత్రుడు పోసాని గారికి కోపం వచ్చింది.. అయితే నేను అన్నది ఒరిజినల్ రైతుల్ని కాదు. నిజమైన రైతులకు నేను క్షమాపణ చెప్తున్నా. నేను ఎప్పుడూ రైతులపై తప్పుగా మాట్లాడలేదు. సినిమా రంగంలో పోసాని నేను మంచి మిత్రులం. ఒక రకంగా నాకంటే సీరియర్. డబుల్ ఎంఎ, పీహెడ్డీ చేశారు. మేం ఎదురు పడినప్పుడు చాలా సంస్కారంగా మాట్లాడుకుంటాం. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం పోసానికి అలవాటు. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవారు.. తమ్ముడూ మనలో తప్పు ఉంటే తల దించుకోవాలి.. తప్పు లేకపోతే తల దించాల్సిన అవసరం లేదు. పోసాని అలాగే ఉంటాడు.. పృథ్వీ కూడా అలాగే ఉండాలని చెప్పేవారు. మా ఇద్దరి మధ్య అనవసరంగా గొడవలు తెచ్చి వైరాలను సృష్టించి సామాజిక వర్గాలుగా విడగొట్టారు మా ఇద్దర్నీ. కాని నేను ఇప్పటికీ ‘ఐ లవ్ పోసాని బ్రదర్’ నా అన్న నన్ను తిట్టినా ఆశీర్వచనంలాగనే భావిస్తున్నా. మా అన్నని నేను ఎప్పుడూ గౌరవిస్తా. పోసాని అన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీ. పృథ్వీపై పోసాని చేసిన కామెంట్స్ ఇవే:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NkmGdL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...