Thursday, 2 January 2020

ఆ రెండు కండిషన్స్‌కు ఒప్పుకుంటునే డేట్స్‌: విజయశాంతి

ఒకప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌గా సౌత్‌ ఇండస్ట్రీని ఏళిన నటి . పొలిటికల్‌ ఎంట్రీతో సినిమాలకు దూరమైన ఈ సీనియర్‌ లాంటి చాలాకాలం తరువాత తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది విజయశాంతి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో భారతీ పాత్రలో నటిస్తోంది విజయశాంతి. దాదాపు హీరో మహేష్‌ బాబుకు సమానమైన పాత్ర కావటంతో నటించేందుకు అంగీకరించింది. అంతేకాదు ప్రమోషన్‌ విషయంలోనూ విజయశాంతిని హీరోకు సమానంగా ట్రీట్ చేస్తున్నారు సరిలేరు నీకెవ్వరు టీం. ఈ సినిమా తరువాత కూడా నటిగా కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటుంది విజయశాంతి. Also Read: ఇప్పటికే పలువరు దర్శక నిర్మాతలు విజయశాంతి డేట్స్‌ కోసం ఆమెను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అయితే అందరికీ ఆమె రెండు కండిషన్స్‌ గట్టిగా చెపుతున్నారట. తనకు స్టార్ హీరోయిన్‌ స్థాయిలో రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని, అలాగే సినిమాలో ప్రాధాన్యమున్న పాత్ర అయితేనే చేస్తానంటూ ముందే తెగేసి చెప్తేస్తుందట రాములమ్మ. దీంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడుతున్నారు. భారీ రెమ్యూనరేషన్‌ ఇచ్చి తీసుకున్నా.. అన్ని సినిమాలో కీలక పాత్రలు క్రియేట్‌ చేయటం కష్టమని భావిస్తున్నారు. ఇప్పటికే తల్లి పాత్రలకు సీనియర్‌ హీరోయిన్లందరూ క్యూ కట్టారు. టబు, నదియా లాంటి గ్లామరస్‌ మదర్స్‌ కూడా ఉన్నారు. మరి ఈ సమయంలో విజయశాంతికి భారీ రెమ్యూనరేషన్‌ ఇచ్చి ఇంపార్టెంట్‌ రోల్స్‌ ఇచ్చే వారు దొరుకుతారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sK6yLv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...