స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి వీరాభిమాని అయిన బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదికి ఓ నెటిజన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఎందుకంటే త్వరలో సిద్ధాంత్.. అగ్ర కథానాయిక దీపిక పదుకోన్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని సిద్ధాంత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. ‘త్వరలో నేను దీపిక పదుకోన్, అనన్య పాండేతో కలిసి నటించబోతున్నాను’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ చూసి దీపిక అభిమాని అయిన ఓ నెటిజన్‌కు ఒళ్లు మండింది. దాంతో సిద్ధాంత్‌ను అతను బెదిరించాడు. ‘సాలే దీపిక పదుకోన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందా నీకు. నిన్ను చంపేస్తా’ అని బెదిరించాడు. అయితే ఈ బెదిరింపులకు సిద్ధాంత్ ఏమీ భయపడలేదు. పైగా అతనికి మూతి పగిలేలా ఆన్సర్ ఇచ్చాడు. ‘ఏం చేయమంటావ్. నన్ను దీపికతో రొమాన్స్ చేయనివ్వు. ఆ తర్వాత నన్ను చంపేయ్. ఎలాగో దీపిక పదుకోన్‌తో రొమాన్స్ చేసి చేసి నేనే చచ్చిపోతా’ అని రిప్లై ఇచ్చాడు. READ ALSO: ‘గల్లీ బాయ్’ సినిమాతో సిద్ధాంత్ జాతకమే మారిపోయింది. ఈ సినిమాలో అతని క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సిద్ధాంత్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. సిద్ధాంత్.. అల్లు అర్జున్‌కు వీరాభిమాని. ఓసారి సిద్ధాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, అతని డ్యాన్స్‌కి పడి చస్తానని చెప్పాడు. ఏదో ఒక రోజు బన్నీతో కలిసి నటించాలనుకుంటున్నానని తెలిపాడు. ఈ విషయం తెలిసి బన్నీ కూడా హ్యాపీగా ఫీలయ్యాడు. తాను కూడా సిద్ధాంత్‌ను కలవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SO7ysT
v
No comments:
Post a Comment