Saturday, 18 January 2020

‘మిస్టర్ అండ్ మిస్’: ముంబై మోడల్‌తో పల్లెటూరి కుర్రాడు లివింగ్ రిలేషన్

డేటింగ్, వీడియో చాటింగ్‌లతో పక్కదారి పడుతున్న యువతను మేలుకొలిపే కథనంతో వస్తున్న చిత్రం . తెలుగు కథ, కథనాలు రేయాలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్‌ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది. అలాంటి కథే "మిస్టర్ అండ్ మిస్". డేటింగ్ లు, వీడియో చాటింగ్‌లు ప్రేమలో భాగం అయిన ఈ జన రేషన్ ప్రేమ కథగా "మిస్టర్ అండ్ మిస్" రూపొందింది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. . ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇది ఈ జనరేషన్ ప్రేమ కథ, ఒక ఇండిపెండెంట్ అమ్మాయి కథ, హీరో క్యారెక్టర్ తో నేటి యువతరం బాగా రిలెేట్ అవుతుంది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతి లివింగ్ రిలేషన్‌లో ఉంటారు. ఈ కథలో ఈ జంటలో ఒకరి మైబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..? యూత్ రిలేట్ అయ్యే కంటెంట్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనులలో ఉన్నఈ చిత్రంలో జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు. పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38gd1Nx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...