Saturday, 18 January 2020

Allu Arjun ‘అల..’పై టీడీపీ ఎంపీ ఆసక్తికర ట్వీట్

అల.. వైకుంఠపురములో చిత్రం చూసిన ప్రేక్షకుల మదిని మెచ్చిన పాట‘సిత్తరాల సిరపడు’. టాలీవుడ్‌లో మారుమోగుతున్న ఈ జానపదే గేయాన్ని ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో సందర్భోచితంగా ఉపయోగించుకుని హైప్ తీసుకువచ్చారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. క్లైమాక్స్ కీలకమైన ఫైట్‌ను ఈ పాటతో ముగింపు ఇవ్వడం ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు.. పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు’ అంటూ శ్రీకాకుళం యాసలో వచ్చే ఈ అచ్చతెలుగు జానపద గేయం సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్నిచేస్తుంది. ఎల్ ఐసీ సీనియర్ ఉద్యోగి బల్లా విజయకుమార్ రాసిన ఈ పాటపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు శ్రీకాకుళం జిల్లా వాసి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ‘అల.. వైకుంఠపురములో శ్రీకాకుళం జానపద గీతాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని మా వాడుక భాషలో రాసిన 'సిత్తరాల సిరపడు' విని చాలా ఆనందించాను. ఈ జిల్లా సంస్కృతి సాహిత్యం తెలుగువాళ్ళకి చెప్పిన దర్శకులు, రచయిత, గేయకర్తకు కృతఙ్ఞతలు’.. అంటూ ట్వీట్ చేస్తూ అల్లు అర్జున్‌కి థాంక్స్ చెప్పారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈ సందర్భంగా ‘అల్లు అర్జున్ స్టైలిష్ ఫైట్.. ఈ పాటకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది’ అని అన్నారు రామ్మోహన్ నాయుడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R5eDDQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...