Saturday, 11 January 2020

మహేష్ బాబుకి దిల్ రాజు ఛాలెంజ్

ప్రముఖ నిర్మాత, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సవాల్ విసిరారు. తనలాగే మహేష్ బాబు కూడా మొక్కలు నాటి చూపించాలని ఛాలెంజ్ చేశారు. మహేష్ బాబుతో పాటు దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడిలకు కూడా ఈ ఛాలెంజ్‌ను విసిరారు దిల్ రాజు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను నిర్మాత దిల్ రాజు స్వీకరించారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో శనివారం మనువడితో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దిల్ రాజు గారు మాట్లాడుతూ.. ‘‘నా మిత్రులు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల మన రాష్ట్రం మన దేశం ఆకుపచ్చగా మారబోతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కి అభినందనలు తెలిపారు. అదే విధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను తాను స్వీకరించిన దిల్ రాజు.. మరో ముగ్గురికి ఆయన ఛాలెంజ్ విసిరారు. ఆ ముగ్గురే.. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి. వీరు ముగ్గురూ దిల్ రాజుకు మంచి అనుబంధం ఉంది. మహేష్ బాబుతో దిల్ రాజు ‘మహర్షి’ సినిమా చేశారు. తాజాగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ఆయన సమర్పకుడు. ఇక వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేసింది దిల్ రాజు. దర్శకుడు అనిల్ రావిపూడికి వరుసపెట్టి అవకాశాలు ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39ZvbET
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...