Saturday, 11 January 2020

క‌ళ్యాణ్‌ రామ్‌ నా షార్ట్ ఫిలిమ్స్‌లో హీరో: మెహ్రీన్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడ‌వురా’. వేగేశ్న సతీష్‌ ద‌ర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివ‌లెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 15న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. ఈ నేపథ్యంలో మెహ్రీన్ పాత్రికేయుల‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం.. ✦ ఈ జ‌న‌వ‌రి నాకు ట్రిపుల్ సెల‌బ్రేషన్సే. ఎందుకంటే ఈ సంక్రాంతికి ‘ఎంత మంచివాడవురా’తో తెలుగు ప్రేక్షకుల‌ను, ‘ప‌టాస్’ చిత్రంతో త‌మిళ ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాను. అలాగే జ‌న‌వ‌రి 31న ‘అశ్వథ్థామ‌’ విడుద‌ల‌వుతుంది. ✦ ‘ఎఫ్‌2’ సినిమాలో నేను చేసిన హ‌ని క్యారెక్టర్ బాగా పాపుల‌ర్ అయ్యింది. అది ప‌క్కా కామెడీగా సాగుతుంది. ‘ఎంత మంచివాడ‌వురా’ విష‌యానికి వ‌స్తే ఇది ప‌క్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మిక్స్ అయ్యి ఉంటుంది. సినిమాలో నా పాత్ర పేరు నందు. ఫ‌స్టాఫ్‌లో బ‌బ్లీగా ఉంటుంది. సెకండాఫ్‌లో మెచ్యూర్డ్‌గా ఉంటుంది. ఇందులో నేను షార్ట్ ఫిలిమ్ ప్రొడ్యూస‌ర్‌.. క‌ళ్యాణ్‌ రామ్‌ గారు నా షార్ట్ ఫిలిమ్స్‌లో హీరోగా చేస్తుంటారు. ఇద్దరం చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్‌గానే ఉంటాం. ✦ ఫ్యామిలీ ఎమోషన్సే మాత్రమే కాదు.. సినిమాలో మంచి యాక్షన్, ల‌వ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. పండ‌గ లాంటి సినిమా. ✦ గుజరాతీ సినిమా ‘ఆక్సిజ‌న్‌’కు ఇది రీమేక్‌. కానీ.. తెలుగు ప్రేక్షకుల‌కు నేటివిటీకి త‌గిన‌ట్లు చాలా మార్పులే చేశారు. అందువ‌ల్ల నేను మాతృక‌ను చూడ‌లేదు. అదీకాకుండా ఇత‌రుల యాక్టింగ్‌ను కాపీ కొట్టడం నాకు ఇష్టం లేదు. ✦ సినిమా కోసం చాలా క‌ష్టప‌డ్డాను. ఉదాహ‌ర‌ణ‌కు ఓ స‌న్నివేశంలో త‌నికెళ్ల భ‌ర‌ణి గారు మూడు పేజీల డైలాగ్ చెబుతారు. నేను కూడా మూడు పేజీల డైలాగ్ చెప్పాలి. దాని కోసం చాలా క‌ష్టప‌డి నేర్చుకున్నాను. సింగిల్ టేక్‌లో ఆ షాట్ ఓకే అయ్యింది. ఇలాంటి క్యారెక్టర్స్ మ‌ళ్లీ రాదు అనిపించి ఒప్పుకుని న‌టించాను. ప్రతి ఒక్కరూ క‌నెక్ట్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దారు. Also Read: ✦ నేను ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ స‌ర‌దాగా ఉంటాను. దాంతో ద‌ర్శకుడు స‌తీశ్‌ గారు న‌న్ను కాంటాక్ట్ చేశారు. ‘ఎఫ్2’ త‌ర్వాత ఐదారు నెల‌లు ఖాళీగా ఉన్నాను. త‌ర్వాత‌నే నాకు ఈ సినిమాలో అవ‌కాశం ద‌క్కింది. ✦ ఎమోష‌న‌ల్ సీన్స్ చేయ‌డం నా బ‌లం. సాధార‌ణంగా ఎమోష‌న‌ల్ సీన్స్‌లో న‌టించ‌డానికి గ్లిజ‌రిన్ వాడుతారు. నేను గ్లిజ‌రిన్ వాడ‌ను. ఎమోష‌న‌ల్‌గా పాత్రకు క‌నెక్ట్ అయ్యి న‌టించ‌డానికి ప్రయ‌త్నిస్తాను. ✦ జ‌యాప‌జ‌యాలు మ‌న చేతిలో ఉండ‌వు. సినిమా క‌థ‌ల‌ను ఎంచుకునేట‌ప్పుడు మంచి క‌థ‌లు ఉండేలా చూసుకోవాలి. ఆ పాత్రల‌కు న్యాయం చేయాలి. అంద‌రూ మంచి సినిమాలు చేయ‌డానికే ప్రయ‌త్నిస్తారు. కానీ ప్రేక్షకుల‌కు న‌చ్చితేనే సినిమా స‌క్సెస్ అవుతుంది. ✦ ప్రస్తుతం నేను ద‌క్షిణాది సినిమాల‌తోనే బిజీగా ఉన్నాను. బాలీవుడ్ గురించి ఆలోచించ‌డం లేదు. అయితే నా త‌మ్ముడు మాత్రం బాలీవుడ్‌లో యాక్టర్‌గా క‌ర‌ణ్ జోహార్‌ గారి ద్వారా లాంచ్ అవుతున్నాడు. తెలుగు చిత్రసీమ నాకు అమ్మతో స‌మానం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QH8CgC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...