Saturday, 11 January 2020

`అల వైకుంఠపురములో` ట్విటర్‌ రివ్యూ: ఫస్ట్ హాఫ్‌ వరకు ఓకే.. కానీ!

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య డిజాస్టర్ కావటంతో బన్నీలో పాటు బన్నీ ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ తెర మీద కనిపిస్తుండటం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ అందించిన క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతమందించిన ఈ సినిమా ఆదివారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్‌ సీస్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా చోట్ల అల వైకుంఠపురములోషోస్‌ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. స్టైలిష్‌ స్టార్‌ అభిమానులు బన్నీ ఇరగదీశాడంటుంటే.. కామన్‌ ఆడియన్స్‌ మాత్రం త్రివిక్రమ్‌ టేకింగ్‌లో లోటు పాట్లను ఎత్తిచూపిస్తున్నారు. అయితో ఓవర్‌లాల్‌గా అల వైకుంఠపురములో కూడా సంక్రాంతి బరిలో సూపర్‌ హిట్ సినిమానే అంటున్నారు. ఓవరాల్‌గా అల వైకుంఠపురములో సినిమాకు సూపర్‌ పాజిటివ్‌ టాక్‌ అయితే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్‌ బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా బన్నీ క్యారెక్టర్‌ చించేశాడంటున్నారు ఫ్యాన్స్‌. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్‌ అవుట్ అయ్యిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. అయితే ఫస్ట్ హాఫ్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసిన త్రివిక్రమ్‌, సెకండ్‌ హాఫ్‌ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడట. ద్వితీయార్థంలో వావ్‌ అనిపించే సన్నివేశాలు పెద్దగా లేకపోవటం, ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవటం నిరాశకలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అసలు కథను పక్కన పెట్టి త్రివిక్రమ్‌ రాసుకున్న సబ్‌ ప్లాట్‌ ఏమంత వర్క్‌ కాలేదంటున్నారు ప్రేక్షకులు. దీంతో సెకండ్‌ హాఫ్‌ బోరింగ్‌గా తయారయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే త్రివిక్రమ్‌ మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లు, బన్నీ మేనరిజమ్స్‌ స్టైల్స్‌ బాగున్నాయన్న టాక్‌ వినిపిస్తోంది. బన్నీ తన కామెడీ టైమింగ్‌ స్టైల్స్‌తో ఇరగదీస్తే తండ్రి పాత్రలో మురళీశర్మ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడట. పేరుకు పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌ ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఇద్దరూ కేవలం గ్లామర్‌ షోకు మాత్రమే పరిమితమయ్యారట. ఇతర పాత్రల్లో సముద్రఖని, సుశాంత్‌, వెన్నల కిశోర్‌, నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణ లాంటి నటులను తీసుకున్న ఎవ్వరినీ సరిగ్గా వినియోగించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tM6IlP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...