Wednesday, 22 January 2020

కామెడీ ట్రిపుల్‌.. `ఎఫ్‌ 2` సీక్వెల్‌లో మరో హీరో!

గత ఏడాది ఘనవిజయం సాధించిన సినిమా ఎఫ్‌ 2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో సినిమా రిలీజ్ తరువాత సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. పలు సందర్భాల్లో హీరో వెంకటేష్‌, నిర్మాత దిల్ రాజులు కూడా ఎఫ్‌ 3 ప్రస్తావన తీసుకువచ్చారు. కథ ఫైనల్‌ అయిన వెంటనే సినిమా సెట్స్ మీదకు వస్తుందని చెప్పారు. అయితే ఈ లోగా అనిల్‌ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాలో బిజీ కావటంతో ఎఫ్‌ 3 పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్‌ హిట్ కావటంతో ప్రస్తుతం బ్రేక్‌ తీసుకుంటున్న అనిల్‌ త్వరలో కొత్త సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. Also Read: అనిల్‌ కొత్త సినిమా ఎఫ్‌ 3నే అన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరోగా నటించబోతున్నాడట. ఆ హీరో మరెవరో కాదు. మాస్‌ మహరాజ్‌ రవితేజ. గతంలో అనిల్‌ దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాలో నటించిన రవితేజ, ఎఫ్‌ 3లో నటించేందుకు సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కోరాజా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ సినిమాను ప్రారంభించాడు రవితేజ. ఈ సినిమా పూర్తి కావడానికి మరో మూడు నాలుగు నెలల సమయం పడుతుంది. వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లు కూడా సెట్స్ మీద ఉన్న సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఎఫ్ 3 పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2umIgYv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...